Sunday, June 12, 2011

మాయదారి ముసలిది బొమ్మలు

మిత్రుడు మన తెలుగు చందమామ సహా రచయిత శ్రీ రాధేశ్యాం రోజున ఇద్దరు మోసగత్తెలు అన్నపేరుతొ ఒక చక్కటి సమీక్ష వ్రాసారు. ఆయన వ్రాసినది మూడవసారి ధారావాహికప్రచురించినప్పటిది అనుకుంటాను. ఇదే కథ తెలుగు చందమామలో మూడుసార్లుప్రచురించబడినది. రెండవసారి వ్రాసినప్పుడు రచయిత శ్రీ ఆర్ నాగభూషణం గారు.

ఈ ధారావాహికకు పట్టు చిత్రాగారు వేసిన బొమ్మలు. అన్ని బొమ్మలూ ఒక్కటొక్కటిగా ఉంచటం కష్టం కాబట్టి. మూడు విడతలుగా తయారు చేసి ఉంచాను. ఆసక్తి కలవారు ఒక్కో బొమ్మను నొక్కి అన్ని బొమ్మలను చూడవచ్చు.










3 comments:

  1. ఆహా..చిత్రాగారి కుంచె నుంచి జాలువారిన ఈ బొమ్మలు చూస్తోంటే ఆ సీరియల్ మళ్ళీ చదివినట్టు ఉంది. ఇవి ఏ సంవత్సరం లో పడిందో జ్ఞాపకం వుంటే చెప్పగలరు. పైగా " ఇద్దరు మోసగత్తెలు" పేరుతో నాకు తెలిసిన కథ మూడోసారి ప్రచురితమైంది అంటున్నారు. మూడోసారికి ఇన్నిబొమ్మలు లేవనిపిస్తోంది. కథ కూడా కొంచం ఎడిట్ చేసేరంటారా..! కానీ బొమ్మలు చూస్తే అవే సన్నివేశాలున్నట్టున్నాయే...!!?? రెండూ చూసాక చిత్రా గారివే కథకి, దగ్గరగా ఉన్నట్టున్నాయి. సన్నివేశాలు కూడా పూర్తిగా కవర్ చేసారు.

    ReplyDelete
  2. పాత చందమామలను చూస్తే పాత మిత్రులు కమ్మగా నోరారా పలకరించినట్లున్తుంది!

    ReplyDelete
  3. సూర్య ప్రకాష్ గారూ.
    చాలా చక్కగా చెప్పారు. ఈ బ్లాగు నేను మొదలుపెట్టినదే అయినా, కొంతమంది సహ చందమామ అభిమానులను కూడా చేర్చుకుని అందరం తలా ఒక వ్యాసం వ్రాస్తూ వచ్చాము. సహజంగ ఆధ్రులం కాబట్టి ఆరంభ ఉత్సాహం ఆవిరైపోయి, ప్రస్తుతం నెలకి కూడా ఒక వ్యాసం వ్రాయటంలేదు.

    మీరు కూడ చందమామ అభిమానులు కాబట్టి, మీరు అలనాటి చందమామ జ్ఞాపకాలను, అప్పటి కథలు, ధారావాహికల గురించిన సమీక్ష లేదా గుర్తులు వగైరా కలిపి వ్యాసాలు వ్రాస్తే ఎంతైనా సంతోషిస్తాము, ఈ బ్లాగులో ఉన్న మిగిలిన సభ్యులకు పున:రుత్సాహం వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి తెలియచేయగలరు, మీరు సమ్మతిస్తే ఇదే బ్లాగులో మీ పేరుతో మీరే మీకు కుదిరిన సమయంలో వ్యాసాలు వ్రాసి ప్రచురించటాంకి అనువుగా ఏర్పాటు చేసి మీకు తెలియచేస్తాను.

    ReplyDelete

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.