Wednesday, October 31, 2012

త్రిశంకు స్వర్గం

    పై బొమ్మ చందమామ పత్రిక వారి సౌజన్యం    
త్రిశంకు స్వర్గం ఏర్పాటు గురించిన కథ అందరికీ తెలిసినదే. కాని ఆ స్వర్గం కాని స్వర్గం ఏర్పాటు దృశ్యం ఇంతవరకూ ఏ చిత్రకారుడూ చిత్రించినట్టు  నాకు తెలియదు. మనందరికీ తెలిసిన అద్భుత చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు చిత్రించిన బొమ్మ ఇది. దేవీ భాగవతం ధారావాహికగా వస్తున్నా రోజుల్లో మాట. మూడు దశాబ్దాల  పైగా కాలం నడిచిపోయింది! ఎన్నాళ్ళయినా ఆ పురాణ ఘట్టాన్ని  బాగా చిత్రించ గలవారు వడ్డాది పాపయ్య గారొక్కరే.




మునుపు ఈ బ్లాగులో ప్రచురించిన వ్యాసం సెప్టెంబరు 2011లో. మళ్ళీ సంవత్సరం పైన  నెల తరువాత మరొక వ్రాత ఈ బ్లాగులో ఇప్పుడే. ఇన్నాళ్ళు ఏ విధమైన కొత్త వ్యాసాలూ వ్రాయకపోయినా బ్లాగును తీసేయ్యకుండా ఉంచిన బ్లాగర్ డాట్ కాం వారికి కృతజ్ఞతలు ఈ బ్లాగు బృందంగా ఏర్పడి నడపబడుతున్నది. కొత్తల్లో బృంద సభ్యులు సహజంగా ఉత్సాహంగా ఆధ్రులం కాబట్టి ఆరంభ శూరత్వం చూపాము కాని రాను రాను ఉత్సాహం నశించినట్టుగా ఉన్నది.  ఈ ఉత్సాహం తగ్గటం గురించి బృంద సభ్యులందరూ ఆలోచించగలరు.

అలనాటి చందమామ  అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఉత్సాహంగా వ్యాసాలూ, సమీక్షలు తరచూ వ్రాయగాలవారిని బృందం లోకి ఇదే ఆహ్వానం. అలనాటి చందమామ అభిమానులు తప్పక స్పందించగలరు.






2 comments:

  1. వ.పా. గారు చిత్రించిన త్రిశంకు స్వర్గం ఘట్టం చాలా బాగుంది- పౌరాణిక దృశ్యాలను కళ్ళకు కట్టటంలో ఆయన ప్రతిభను మరోసారి నిరూపిస్తూ!

    ReplyDelete
  2. nice information and great post
    keep going

    ReplyDelete

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.