Friday, April 26, 2013

ఒక శుభవార్త



తెలుగు చందమామ అభిమానులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ విసుగు చెందని విక్రమార్కుల లాగ  (1947 నుంచి 1980 వరకు) అలనాటి చందమామలు కాని, అప్పటి ధారావాహికలుగాని ఎక్కడన్నా దొరుకుతాయా అని వెతుకుతున్న వారికి ఇదొక శుభవార్త.


ఈ రోజున, చూద్దాం ఎక్కడన్నా దొరుకుతాయేమో అని చందామామ సీరియల్స్ ఇన్ ఇ పబ్ (పి డి ఎఫ్ లాగ ఇదొక డాక్యుమెంట్) అని గూగులమ్మని అడిగాను( ఈ మధ్య ముంబాయి వచ్చిన తరువాత ప్రయాణంలో ఐ పాడ్ లో "ఇ పబ్"{epub} పుస్తకాలు చదవటం మంచి కాలక్షేపం గా ఊన్నది). ఎప్పటికీ విసుగు చెందని గూగులమ్మ, వెంటనే కమ్మటి వార్త చెప్పింది.  

ఇంటర్నెట్ ఆర్ఖైవ్ వెబ్ సైటులో మనకు చిరపరిచితమైన అలనాటి చందమామ ధారావాహికలు కొన్ని అప్లోడ్ చేశారు అన్న విషయం తెలిసింది.  అంతే  కాదు అనేక రకాల ఫార్మాట్లల్లో ఉన్నాయి డౌన్లోడ్ కూడా  చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ చదువుకోనూ వచ్చను. 

ఎక్కడనుంచి,  ఎలా అంటే, ఈ కింది లింకు నొక్కి వచ్చిన సమాచారం ప్రకారం మీకు కావలిసినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు:



పాత చందమామల డౌన్లోడ్ల విషయంలో యులిబ్ డాట్ ఆర్గ్ కానివ్వండి మరొక వెబ్సైటు కాని  మునుపు,  చందమామ అభిమానులకు ఎదురైన అనుభవం రీత్యా, ఇప్పుడు ఈ ఫైళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోవటం లో తప్పు లేదు కదా.   కాబట్టి ఆలస్యం దేనికి దారితీస్తుందో అభిమానులకు తెలియనిది కాదు. 

కొసమెరుపు:
చివరగా నేను ఎంతో ఆశగా ఐ పాడ్లో ఇ పబ్ ఫార్మాట్లో హాయిగా పుస్తకం తిరగేస్తున్నట్టుగా చదువుదామని డౌన్లోడ్ చేస్తే, ఈ ఫైళ్ళు ఎలా చేశారో కాని తెలుగు స్క్రిప్ట్ కనపడటం లేదు.బొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇ పబ్ ఫార్మాట్లో తెలుగు లిపి కనపడుట  లేదు.ఇది కొంత నిరాశ అయినా, పిడి ఎఫ్ గా చదువుకోవటానికి   బాగానే ఉన్నది. 
 
**********************************
కాబట్టి, ప్రస్తుతానికి పిడిఎఫ్ ఫార్మాట్ లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఐ పాడ్లో చదువుకుందామనుకునే వారికి ఒక చిట్కా! సామాన్యంగా ఐపాడ్లో ఉండే "ఐ బుక్స్" లో కాకుండా "కోబో" డౌన్లోడ్ చేసుకుని  ఆందులో,  ఈ పిడిఎఫ్ లు చదువుకుంటూ ఉంటే,  చక్కగా పేజీలు  చేత్తో తిప్పినట్టుగా తిరుగుతూ, అచ్చం మన చేతిలో చందమామ పుస్తకమే ఉన్నదన్న భావన కలుగుతున్నది. ప్రయత్నించి చూడండి.
**********************************

No comments:

Post a Comment

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.